గూగుల్ క్రోమ్‌లో కొత్త అప్‌డేట్..

- December 12, 2022 , by Maagulf
గూగుల్ క్రోమ్‌లో కొత్త అప్‌డేట్..

గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్  సర్వీసుల్లో క్రోమ్ బ్రౌజర్ ఒకటి. క్రోమ్ యూజర్ల కోసం గూగుల్ పాస్‌కీ లను ప్రారంభించింది. అక్టోబరులో ప్రారంభమైన ఈ ట్రయల్ టెస్టును అనుసరించి, Google పాస్‌వర్డ్‌లో సేఫ్ లాగిన్ ప్రక్రియను Chrome స్టేబుల్ M108లో విలీనం చేసింది. కొత్త పాస్‌కీ ఫీచర్ Windows 11, macOS, Android రన్ అయ్యే డెస్క్‌టాప్, మొబైల్ డివైజ్‌ల్లో పని చేస్తుంది. దీనికి అదనంగా, Google సొంత పాస్‌వర్డ్ మేనేజర్ లేదా ఏదైనా సపోర్టు ఉన్న థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా Chrome యూజర్లకు పాస్‌‌కీలను సెట్ చేసేందుకు అనుమతినిస్తుంది.

ఆండ్రాయిడ్ నుంచి ఇతర డివైజ్‌లకు వారి సెక్యూరిటీ కీలను యాక్సస్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. పాస్‌కీలు అనేది మీ కంప్యూటర్, ఫోన్ లేదా USB సెక్యూరిటీ Key వంటి ఇతర డివైజ్‌లతో సహా మీ డివైజ్‌లలో స్టోర్ చేయగల ప్రత్యేక డిజిటల్ ఐడెంటిటీ కలిగి ఉంది. డివైజ్ బయోమెట్రిక్స్ సులభమైన అథెంటికేషన్ ద్వారా వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లలోకి లాగిన్ చేసేందుకు పాస్‌కీలు యూజర్లను అనుమతిస్తాయి.

డెస్క్‌టాప్ డివైజ్‌లో మీ సమీపంలోని మొబైల్ డివైజ్ నుంచి పాస్‌కీని ఉపయోగించడాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీరు Android లేదా iOS డివైజ్ ద్వారా పాస్ కీలను ఉపయోగించవచ్చు. సైన్ ఇన్ చేసేటప్పుడు పాస్‌కీ తో మీ మొబైల్ డివైజ్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. సేఫ్‌గా రూపొందించిన కోడ్ మాత్రమే సైట్‌తో ఎక్స్ఛేంజ్ అవుతుందని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది.

అయితే, ఆండ్రాయిడ్‌లోని క్రోమ్‌లో, పాస్‌కీలు Google పాస్‌వర్డ్ మేనేజర్‌లో స్టోర్ అవుతాయి. అదే Google అకౌంట్లోకి సైన్ ఇన్ చేసిన యూజర్ Android డివైజ్‌ల మధ్య పాస్‌కీలను యాక్సస్ చేసేందుకు అనుమతినిస్తుందని బ్లాగ్‌పోస్ట్ పేర్కొంది. క్రోమ్ యూజర్లు తమ బయోమెట్రిక్ సెన్సార్ (ఫింగర్ ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్), పిన్ లేదా ప్యాటర్న్‌ని ఉపయోగించి యాప్‌లు, వెబ్‌సైట్‌లకు సైన్ ఇన్ చేసే అవకాశం ఉంది.

పాస్‌వర్డ్‌ల కంటే పాస్‌కీలు మెరుగ్గా ఉంటాయి. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం చాలా కష్టం.. అందుకే బయోమెట్రిక్‌లను ఉపయోగించి పాస్‌కీలను సెట్ చేస్తే, పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. SMS లేదా యాప్ ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్‌ వలె కాకుండా, ఫిషింగ్ అటాక్స్ నుంచి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

పాస్‌వర్డ్‌ల మాదిరిగానే.. యూజర్ Google అకౌంట్‌కు సైన్ ఇన్ చేసినప్పుడు.. ఈ డివైజ్ లేదా వెబ్‌సైట్ పాస్‌కీ ని అడుగుతుంది. లాగిన్‌ అథెంటికేషన్ కోసం యూజర్లు తమ ఫింగర్ ఫ్రింట్ లేదా సేవ్ చేసిన పాస్‌కీలను ఉపయోగించాల్సి ఉంటుంది. లాగిన్‌ను పూర్తి చేసేందుకు యూజర్లు డివైజ్ స్క్రీన్ అన్‌లాక్‌ను ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా, Google, Apple, Microsoft, PayPal, eBayతో సహా అనేక కంపెనీలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలో పాస్‌వర్డ్ సైన్-ఇన్ చేసేందుకు పాస్‌వర్డ్‌లను పాస్‌కీ లను వాడటం అనేది కొత్తదేం కాదు. ఈ టెక్నాలజీని Apple, Google వంటి పెద్ద టెక్ దిగ్గజాలు పాస్‌కీల వినియోగం మారుతుందని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com