సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ శుభవార్త...
- December 12, 2022
న్యూ ఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది.గతంలో రద్దు చేసిన టిక్కెట్లపై రాయితీని తిరిగి పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రెండేళ్ల క్రితం కోవిడ్ సమయంలో రైళ్లు చాలా కాలం రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం రైళ్లు పాక్షికంగానే నడిచాయి.
అయితే, ఆ సమయంలో నష్టాల నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ అనేక విభాగాల్లో టిక్కెట్లపై ఇచ్చే రాయితీని ఎత్తేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా తొలగించింది. దీనిపై అప్పట్లోనే కేంద్రంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తర్వాత వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంటులో నలుగురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది ఆగష్టు 4న ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని సూచించింది.
స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీల్లో రాయితీ ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ప్యాసింజర్ల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వెంటనే రాయితీ అమలు చేయాలని సూచించింది’’ అని మంత్రి ప్రకటించారు. దీంతో త్వరలోనే కేంద్రం రాయితీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. కాగా, 2019లో ప్రయాణికులకు రూ.59,837 కోట్ల రాయితీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికీ దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







