పబ్లిసిటీ పిచ్చ పరాకాష్టకెళ్లిందిగా.! ‘ఆమె’ గురించి ‘ఈమె’కెందుకంట.!
- December 14, 2022
సోషల్ మీడియా ట్రెండ్ వచ్చాకా ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని ఎత్తుకుని ఈజీగా పాపులర్ కావడం అనేది ఓ ప్యాషన్‌గా మారింది. నటిగా చిన్న చిన్న పాత్రలు చేసుకునే కల్పిక గణేష్ ఈ మధ్య అదే ఫార్ములాని ఫాలో చేస్తోంది.
సినిమాల్లో ఏమొస్తుంది కిక్కు.! ఇలా చేస్తేనే కదా అసలు సిసలు కిక్కు. తన తోటి నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పబ్లిసిటీ మూట కట్టుకుంటోంది.
తాజాగా నటి ధన్య బాలకృష్ణన్‌పై కల్పిక కొన్ని కల్పిత స్టోరీలల్లేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నటి ధన్య బాలకృష్ణన్ కూడా అడపా దడపా చిన్ని చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది.
తెలుగుతో పాటూ, తమిళంలోనూ నటిగా సుపరిచితురాలైన ఈమె ఓ తమిళ డైరెక్టర్ని అది కూడా పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్ని సీక్రెట్‌గా వివాహం చేసుకుని అక్కడే కాపురం పెట్టేసిందని వెల్లడించింది.
అయినా ధన్య ఏం చేస్తే ఈమెకెందుకంట.? ఆ ప్రశ్నయే ఈమెని అడిగితే, సదరు డైరెక్టర్ ధన్యని మెంటల్‌గా హింసిస్తున్నాడనీ, ఆమెపై అనవసరమైన పెత్తనం చెలాయిస్తున్నాడని తనకు అనుమానంగా వుందనీ సెంటిమెంట్ అస్త్రాలు విసురుతోంది. తన దారేదో తాను చూసుకోకుండా, అవతలి వాళ్ల జీవితంలోకి తొంగి చూసుడెందుకు.! అంటూ కల్పికను ఆడి పోసుకుంటున్నారు నెటిజన్లు. అంతేగా.. అంతేగా.!
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









