‘అవతార్ 2’ చిత్రానికి శ్రీనివాస్ ‘అవసరం’ పడిందా.?

- December 14, 2022 , by Maagulf
‘అవతార్ 2’ చిత్రానికి శ్రీనివాస్ ‘అవసరం’ పడిందా.?

‘అష్టా చెమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తనదైన రచనా టాలెంట్‌నీ బయట పెట్టుకున్నాడు.
తెలుగు నాట, నటుడిగా, దర్శకుడిగా, డైలాగ్ రైటర్‌గా తనదైన ముద్ర వేసుకున్న శ్రీనివాస్ అవరసరాల తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కంచుకోవడం విశేషం. 
ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతున్న ‘అవతార్ 2’ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే ఛాన్స్ శ్రీనివాస్ అవసరాలను వరించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 
ముఖ్యంగా తెలుగులో 100 కోట్ల టార్గెట్ దిశగా ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆయా భాషల నుంచి పలువురు డైలాగ్ రైటర్స్ ఎంపిక కాగా, తెలుగు నుంచి శ్రీనివాస్ అవసరాల సెలెక్ట్ అయ్యారు.
‘అవతార్ 2 - ది వే ఆఫ్ వాటర్’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి శ్రీనివాస్ అవసరాల వంటి తెలుగు వ్యక్తికి ఛాన్స్ దొరకడం టాలీవుడ్ చేసుకున్న అదృష్టంగానే భావించాలి. అవసరాల ఈ అతిపెద్ద బాధ్యతను తన టాలెంట్‌తో ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com