'IOCL' లో ఉద్యోగాలు
- December 14, 2022
న్యూ ఢిల్లీ: నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) శుభవార్త అందజేసింది.
భారీ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. IOCLకు పెట్రోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వ్యాపారంలో ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పని చేస్తుంది. ఈ కంపెనీ అతిపెద్ద గవర్నమెంట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల లిస్టులో 142 ర్యాంకులో ఉంది. ఈ సంస్థలో ఉద్యోగం సంపాదిస్తే కెరీర్ బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రణాళిక మేరకు సిద్ధమైతే ఉద్యోగం సాధించవచ్చని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు IOCL ఉద్యోగాలకు అర్హత, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మొత్తం 1760 ఖాళీలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ 1760 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాలకు సంబంధించి టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు 2022 డిసెంబర్ 14 నుంచి 2023 జనవరి 3లోగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అధికార వెబ్సైట్(http://www.Iocl.Com) ద్వారా అప్లై చేసుకోవాలి.
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో భర్తీ
భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలలో కలిపి ఈ 1760 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక , కేరళ , తమిళనాడు పుదుచ్చేరి, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, అస్సాం, సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఛండీగర్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఈ పోస్టులో భర్తీ జరుగుతుంది.
IOCL రిక్రూట్మెంట్ వివరాలు...
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2023 జనవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది.
వయసు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిబంధనలు...
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. గరిష్ఠంగా 24 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో వివిధ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







