జనవరి నుండి భార్య, పిల్లల కోసం విజిట్ వీసాల జారీ!
- December 15, 2022
కువైట్: విజిట్ వీసాకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ తన ప్రణాళికను ఖరారు చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభంలో నిర్ణయం వెలువడుతుందని అధికారులు తెలిపారు. విజిట్ వీసాను వర్క్ పర్మిట్కి బదిలీ చేయడాన్ని నిరోధించడంతో పాటు, విజిట్ వీసాలను మంజూరు చేయడానికి కఠినమైన షరతులను అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. విజిట్ వీసా కోసం రుసుము రెట్టింపు చేయబడుతుందని, వీసా కేవలం భార్య, పిల్లలకు మాత్రమే అనుమతించబడుతుందన్నారు. అధిక జీతాలు తీసుకునే వారి కోసం మాత్రమే తల్లిదండ్రులకు సంబంధిత వీసాలను జారీ చేస్తారని తెలిపారు. విజిట్, కుటుంబ సభ్యుల పునఃకలయిక వీసాల మంజూరు కోసం షరతులపై నిర్ణయాన్ని జారీ చేయడానికి, తుది నిర్ణయం తీసుకోవడానికి అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాకు సమర్పించే నివేదికకు టెక్నికల్ కమిటీ ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే పనిలో ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







