చైల్డ్ ఒబెసిటీ: బాధితుల్లో 35% బాయ్స్, 28% గర్ల్స్

- December 15, 2022 , by Maagulf
చైల్డ్ ఒబెసిటీ: బాధితుల్లో 35% బాయ్స్, 28% గర్ల్స్

కువైట్: చైల్డ్ ఒబెసిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్రమైన సమస్యగా మారుతున్నది. ముఖ్యంగా కువైట్‌లో పిల్లలు, యుక్తవయస్సు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. వారిలో 39 మిలియన్లు పిల్లలు ఉండగా.. క్రమంగా వారి సంఖ్య పెరుగుతోందని పోషకాహార నిపుణురాలు షేఖా అల్-మెస్బా తెలిపారు. పిల్లల ఊబకాయం శాతం బాలురలో 35 శాతానికి, బాలికల్లో 28 శాతానికి చేరుకుందని వెల్లడించారు. “స్థూలకాయం పెరగడం వల్ల పిల్లల్లో మధుమేహం అభివృద్ధి చెందడాన్ని మనం చూస్తున్నాం. ఇది టైప్ 2 డయాబెటీస్ కు దారితీస్తోంది. సాధారణంగా ఇది పెద్దవారిలో చూస్తాం. కానీ ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాం. ఈ రకమైన మధుమేహం అనారోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి లోపాల కారణంగా వస్తుంది. ” అని ఆమె చెప్పారు.

పిల్లల ఆహారపు అలవాట్లను మార్చాలంటే తల్లిదండ్రులు మారాలని ఆమె సూచించారు. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో తల్లిదండ్రులు రోల్ మోడల్స్ అని మెస్బా తెలిపారు. “తల్లిదండ్రులు రోల్ మోడల్స్. తల్లితండ్రులు ఏది తింటారో.. వారి తల్లిదండ్రులను అనుకరించడం వలన పిల్లలు కూడా అదే తింటారు. తల్లితండ్రులు స్థూలకాయంతో ఉన్నట్లయితే, పిల్లలు కూడా అదే ఆహారపు అలవాట్లను నేర్చుకోవడం వల్ల పిల్లలు ఊబకాయానికి గురవుతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే తమ జీవనశైలిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యంగా ఉండాలి. తగినంత వ్యాయామం చేయాలి. ”అని ఆమె సూచించారు. "పిల్లలకు కూరగాయలు అలవాటు చేయాలి. దురదృష్టవశాత్తు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు క్యాండీలు, చాక్లెట్, శీతల పానియాలను అందిస్తారు. చిన్నపిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించాలి. ఇది వారు పెద్దయ్యాక ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన సమాజానికి దారి తీస్తుంది. ”అని ఆమె చెప్పారు.
పిల్లలకు రోజంతా భోజనం, అల్పాహారం మానేయకుండా మూడు పూటలా తినే అలవాటు చేయాలని తల్లిదండ్రులకు మెస్బా సూచించారు. పిల్లల భోజనంలో ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, పాలు, ఆరోగ్యకరమైన ధాన్యాలు తగినంతగా ఉండేలా చూడాలన్నారు. పిల్లలు చిరుతిళ్లు తినేందుకు ఆసక్తి చూపుతారన్నారు. వాటి స్థానంలో పండ్లు, కూరగాయల ముక్కలు, గింజలు, పాప్‌కార్న్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను అందించాలని సూచించారు. పిల్లలు జిమ్ లేదా స్పోర్ట్స్ గ్రూప్‌లో చేరేలా పేరెంట్స్ ప్రోత్సహించాలన్నారు. దీని కారణంగా పిలల్లు చురుకుగా ఉంటారని, ఆరోగ్యకరమైన, ఫిట్ బాడీని కలిగి ఉంటారని మెస్బా వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com