సగం ధరకే ఐఫోన్ అంటూ ఫ్రాడ్.. వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా
- December 15, 2022
దుబాయ్: సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి అరబ్ మహిళను మోసం చేసిన గల్ఫ్ పౌరుడిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మొబైల్ ఫోన్‌లను వాటి మార్కెట్ విలువలలో సగం కంటే తక్కువ ధరకే అందిస్తానంటూ సదరు వ్యక్తి ప్రకటనలు పెట్టాడు. నిందితుడితో తనకు గతంలో ఎలాంటి సంబంధాలు లేవని బాధితురాలు పేర్కొంది. ఐఫోన్‌లను తక్కువ ధరకు అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనను చూసి సంప్రదించినట్లు ఆమె కోర్టుకు తెలిపింది. 60,000 దిర్హామ్‌లకే ఐఫోన్ ను పంపడానికి ప్రకటన ఇచ్చిన వ్యక్తి అంగీకరించాడని, దాంతో అతని అకౌంట్ కు డబ్బును బదిలీ చేసినట్లు మహిళ పేర్కొంది. అయితే ఆ మొత్తాన్ని అందుకున్న తర్వాత సదరు వ్యక్తి ఐ ఫోన్ ను పంపలేదని, డబ్బును కూడా బదిలీ చేయలేదని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు.. నిందితుడికి ఒక నెల జైలుశిక్ష, 60,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







