హూప్స్.! రష్మిక అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి.!
- December 15, 2022
తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక, ఇప్పుడు బాలీవుడ్‌నీ చక్కబెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాతో రష్మిక మండన్నా స్టార్డమ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుందని చెప్పొచ్చు.
దాంతో, బాలీవుడ్లో యమా యాక్టివ్‌గా జోరు చూపించింది రష్మిక. ఒకదానిపై ఒకటి అన్నట్లుగా ఏకంగా మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టేసింది. చకచకా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసింది.
అందులో ‘గుడ్ బై’ అనే సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యింది కానీ, ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. బిగ్‌బి అమితాబ్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించారు.
ధియేటర్లలో సో సో అనిపించుకున్న ఈ సినిమా రీసెంట్గా ఓటీటీకీ వచ్చేసింది. అక్కడ కూడా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదీ సినిమాపై.
ఇదిలా వుంటే, రష్మిక నటించిన ఇంకో సినిమా ‘మిస్టర్ మజ్ను’ డైరెక్ట్ ఓటీటీలో రిలీజైపోతోంది. అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లు లేటెస్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. పాప.! రష్మిక ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. తీరా చూస్తూ పరిస్థితి ఇలాగైపోయింది.. అంటూ రష్మిక యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!







