‘ఇండియన్ 2’ కోసం కమల్ హాసన్.! రెండు కాదు మూడు.!
- December 15, 2022
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ రివీల్ అయ్యింది.
మొదటి పార్ట్ ‘ఇండియన్’ కోసం కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా, ఇండియన్ 2 కోసం మూడు పాత్రల్లో కనిపించనున్నారట.
సేనాపతి, అతని కొడుకు చంద్రబోస్ పాత్రల నేపథ్యంలో ‘ఇండియన్’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి సేనాపతి, అతని తండ్రి పాత్రల (1920 ల కాలం) నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందట.
అలాగే, మనవడు చంద్రబోస్ కాలాన్ని కూడా సమాంతరంగా నడపనున్నారట. ఆ మూడో పాత్ర అంటే, సేనాపతి తండ్రి పాత్ర కోసం కమల్ హాసన్ 90 ఏళ్ల వయసున్న వ్యక్తిలా కనిపించబోతున్నారట. ఈ పాత్ర కోసం ఆయన చాలా చాలా కష్టపడ్డారట. కొన్ని రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా, కేవలం పండ్లరసాలతోనే గడిపేశారట.
ఈ పాత్రే ఈ సినిమాకి అత్యంత కీలకంగా చెబుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







