ఈ సంక్రాంతికి అసలు సిసలు పండగ నాదే అంటోన్న ‘సుగుణ సుందరి’.!
- December 16, 2022
ఈ సంక్రాంతికి శృతిహాసన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండూ పెద్ద సినిమాలే. స్టార్ హీరోల సినిమాలే. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకోవడమే గొప్ప.. అంటే, ఆ రెండు క్రేజీ ప్రాజెక్టులూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడం మరీ విశేషం.
సెకండ్ ఇన్నింగ్స్‌లో లక్కు తోక తొక్కి వచ్చింది శృతిహాసన్. ఇక, ప్రమోషన్లలో భాగంగా రెండు సినిమాల నుంచీ రిలీజైన శృతిహాసన్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ కోసం ‘శ్రీదేవి’గా, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ కోసం ‘సుగుణ సుందరి’గా డబుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది శృతి హాసన్.
దాంతో ఈ సంక్రాంతి తనకు అసలు సిసలు పండగ అని మురిసిపోతోంది. అలాగే తన సినిమాలు రిలీజ్ అయ్యే టైమ్ కోసం ఎప్పుడెప్పుడా.? అని ఆసక్తిగా ఎదురు చూస్తోందట శృతి హాసన్.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







