బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త...

- December 17, 2022 , by Maagulf
బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త...

న్యూ ఢిల్లీ: పర్యటన నిమిత్తం బ్రిటన్‌ వెళ్లనున్న వారికి ఇక పై దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే విజిట్‌ వీసాలు అందనున్నాయి.ఈ విషయాన్ని బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లీస్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి 15 రోజుల్లోనే విజిట్‌ వీసా ఇస్తామని రెండు నెలల క్రితం ప్రకటించామని గుర్తు చేశారు. ఇంకా ముందుగానే కావాలనుకుంటే ‘ప్రయారిటీ వీసా విధానా’న్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆ మార్గంలో అయితే అయిదు రోజుల్లోనే వీసా వస్తుందని చెప్పారు. భారీ సంఖ్యలో స్టూడెంట్‌ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరిలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వీసాలకు డిమాండు అధికంగా ఉన్నందున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com