5 టన్నుల స్క్రాప్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద ‘వీణ’
- December 17, 2022
భోపాల్: భారతదేశ కళల కాణాచి. ఒక్కో కళాకారుడితి ఒక్కోరకం ప్రతిభ. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు చేసే నేతన్నల కళకు పుట్టినిట్లు మన భారత దేశం. అటువంటి కళాకారులకు..నైపుణ్యాలకు లోటే లేదు భారతదేశంలో. అటువంటి భారత్ తో కొంతమంది కళాకారులు తయారు చేసిన 28అడుగుల పొడుగున్న వీణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరదు కళాకారుల ప్రతిభకు అద్దంలా నిలుస్తోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన కొంతమంది కళాకారులు స్ర్కాప్ తో భారీ వీణ తయారు చేశారు. 10 టన్నుల బరువున్న స్క్రాప్ తో ‘రుద్ర వీణ’ ను ఎంతో కళాత్మకంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వీణ 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో ఉంది.
ఈ రుద్రవీణ తయారు చేయటానికి కళాకారులకు దాదాపు రూ.10లక్షలు ఖర్చు అయ్యాయి. వీణను తయారు చేయటానికి ఆరు నెలలు పట్టింది. తీగ మీటితే రాగాలు పలుకుతుంది వీణ. కానీ ఈ రుద్రవీణ తీగలు మీటితే రాగాలు పలకదు. ఎందుకంటే పాతబడిన వాహనాలకు చెందిన పరికారాలు వైర్లు, చైన్స్, బేరింగ్స్ ఉపయోగించారు కాబట్టి. ఏది ఏమైనా కళా వాయిద్యం అయిన వీణను పనికిరాని చెత్తతో ఇంత అందంగా అద్భుతంగా తయారు చేసిన ఆ కళాకారులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. పనికి రాని వస్తువులతో కూడా ఇంత అందమైన కళాకృతులను తయారు చేయటం భారతీయ కళాకారుల ప్రత్యేకత అని చెప్పి తీరాల్సిందే..
ఈ వీణను తయారు చేసిన కళాకారుల్లో ఒకరైన పవన్ దేశ్ పాండే మాట్లాడుతూ..15మంది కళాకారులు ఆరు నెలలు కష్టపడి ఈ వీణ తయారు చేశామని..పనికిరాని పరికరాలతో ఇంత భారీ వీణకు ఇంతవరకు ఎవరు తయారు చేయాలేదని తెలిపారు. ఈ వీణ భోపాల్ లోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద వీణ అని తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







