దుబాయ్ లో ప్రవాస భారతీయుడి మృతి
- December 17, 2022
దుబాయ్: దుబాయ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వదేశం నుంచి వెళ్లిన మరుసటి రోజే భారత ప్రవాసుడు తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. మృతుడు మయ్యన్నుర్ వాసి సక్కీర్ (46) ఇటీవలే సెలవులపై స్వస్థలానికి వచ్చి, తిరిగి దుబాయ్ వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లిన మరుసటి రోజే అతడు తన బెడ్‌రూంలో అచేతనంగా పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. నిద్రలోనే గుండెపోటుకు గురికావడంతో చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, అతడి భౌతికకాయాన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు.
అయితే, ఇటీవల స్వదేశానికి వచ్చిన సక్కీర్ తిరిగి దుబాయ్ వెళ్లే ముందు అమ్మచేతితో అన్నం తిన్నాడు. ఆ సమయంలో అతడి కుమారుడు షాబాజ్ దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోలో సక్కీర్ ఎంతో ఆనందంగా తన అమ్మచేతి ముద్ద తినడం ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. సక్కీర్ మరణవార్తతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







