వైసీపీ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

- December 18, 2022 , by Maagulf
వైసీపీ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జగన్ సర్కార్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఈసారి విమర్శల్లో బాగా డోస్ పెంచారు పవన్ కల్యాణ్. వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని పవన్ హెచ్చరించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

”వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు. వైసీపీ రాకుండా చూసుకునే బాధ్యత నాది. వైసీపీ నేతలు మాట్లాడేవన్నీ పనికిమాలిన మాటలే. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలి. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతా. వాళ్ల నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత బలంగా పైకి లేస్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు పవన్ కల్యాణ్. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

పోరాటం చేయనిదే మార్పు రాదన్న పవన్.. ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఆశించే ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలన్నారు పవన్. కేసులు పెడతారని భయపడొద్దని, ధైర్యంగా నిలబడాలని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తేలేదన్న పవన్ కల్యాణ్.. అందుకు తాను కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com