ఒమన్ లో 1,000కు పైగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం
- December 19, 2022
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని బార్కాలోని విలాయత్‌లో 1,000 కంటే ఎక్కువ వెటర్నరీ కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. సౌత్ బటినా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్.. వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించి వెటర్నరీ ఉత్పత్తులను విక్రయించే బర్కా విలాయత్ లోని కంపెనీపై దాడి చేసిందన్నారు. అక్కడ ఉత్పత్తుల గడువు తేదీలను మార్చి.. వాటికి కొత్త చెల్లుబాటు అయ్యే తేదీలను వేయడాన్ని గుర్తించామని సీపీఏ తెలిపింది. ఇతర గడువు ముగిసిన ఉత్పత్తులను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







