తెలంగాణ, ఏపి మధ్య మరో నేషనల్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- December 19, 2022
హైదరాబాద్: తెలంగాణ, ఏపి రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. రూ. 4,706 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కృష్ణానదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మొత్తం ఏడు ప్యాకేజీల కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి ఏడాదిన్నర కాలంలో పూర్చి చేయాలని కేంద్రం భావిస్తోంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







