వాల్తేరు వీరయ్య నుంచి సెకండ్ సింగిల్ విడుదల
- December 19, 2022
హైదరాబాద్: వాల్తేర్ వీరయ్య మూవీ లోని నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవి అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బాస్ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోగా..ఇక సినిమాలోని నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవి అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు.
చిరంజీవి–శృతి హాసన్ ల ఫై ఈ సాంగ్ ను ప్యారిస్ లో షూట్ చేయడం జరిగింది. పాటలో చిరంజీవి ఫ్లూట్ వాయించే భంగిమలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఆయన సరసన శ్రుతి హాసన్ మంచుకొండల్లో విరిసిన మల్లెమొగ్గలా అందాలు వెదజల్లుతోంది. మొత్తానికి ఈ సాంగ్ కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







