ప్రాపర్టీ పేరిట ఫ్రాడ్.. సోదరికి KD30,000 చెల్లించాలని వ్యక్తిని ఆదేశించిన కోర్టు
- December 19, 2022
అల్ ఐన్: ఆస్తి కోనుగోలు చేస్తానని తన నుంచి 20,000 కువైట్ దినార్‌లు తీసుకొని మోసం చేశాడని సోదరుడిపై ఓ మహిళా దావా వేసింది. తన సోదరుడు ఆస్తి కొనుగోలు చేయనందున తాను తీవ్రంగా నష్టపోయానని సదరు మహిళ అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో వేసిన దావాలో పేర్కొంది. ఇందుకుగానూ తనకు 20,000 కువైట్ దినార్లు లేదా దానికి సమానమైన UAE దిర్హామ్‌లు ఇప్పించాలని, అలాగే మానసిక వేదనకు Dhs240,000, పరిహారం కింద Dhs50,000 చెల్లించేలా తన సోదరుడిని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. సదరు మహిళ కువైట్‌లో పనిచేస్తున్నప్పుడు తన సోదరుడికి 20,000 కువైట్ దినార్లను బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. తన కోసం ఆస్తిని కొనుగోలు చేయడానికి అమౌంట్ పంపానని, కానీ అతను అలా చేయలేదని, ఆ మొత్తాన్ని తన కోసం వాడుకున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను బ్యాంకు ద్వారా తన సోదరి నుంచి అమౌంట్ ను స్వీకరించినట్లు సదరు వ్యక్తి అంగీకరించాడు. అయితే తన సోదరి అభ్యర్థన మేరకు మరొక వ్యక్తికి ఆ మొత్తాన్ని అందజేసినట్లు కోర్టు సూచించింది. కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టుకు అందివ్వలేదు. సోదరి పంపిన అమౌంట్ నుండి ప్రయోజనం పొందాడని కోర్టు ధృవీకరించింది. కాబట్టి అతను తన సోదరికి 20,000 కువైట్ దినార్లు లేదా దానికి సమానమైన UAE దిర్హామ్‌లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజులు, ఖర్చులతో పాటు పరిహారంగా Dhs10,000 అదనంగా చెల్లించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







