భద్రతా నిబంధనల ఉల్లంఘన: వారంలో 15 వేల మంది అరెస్ట్
- December 19, 2022
రియాద్: రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక వారంలో దాదాపు 15,000 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 8-14 వరకు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం 8,817 మందిని అరెస్టు చేయగా, చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటే ప్రయత్నాలకు 3,879 మందిని, కార్మిక సంబంధిత సమస్యలపై 2,125 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రవాణా, ఆశ్రయం కల్పించడంతోపాటు ఎవరైనా రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సహాయం చేస్తున్నట్లు తేలితే, గరిష్టంగా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ ($260,000) వరకు జరిమానా లేదా వాహనాలు, ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుమానాస్పద ఉల్లంఘనలను మక్కా, రియాద్ ప్రాంతాలలో టోల్-ఫ్రీ నంబర్ 911, రాజ్యంలో ఇతర ప్రాంతాలలో 999 లేదా 996కు నివేదించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







