ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
- December 19, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పంచాయితీ రాజ్ శాఖ ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 22 మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్(సీఎస్ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేష్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 20-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;http://https://westgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







