బిగ్‌బాస్: విన్నర్ కంటే రన్నర్‌కే బాగా గిట్టుబాటయ్యిందిలే.!
- December 19, 2022
గత మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్‌బాస్ షోకి తెర పడిపోయింది. బిగ్‌బాస్ ట్రోఫీని గెలిచి సింగర్ రేవంత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు.
ట్రోఫీ అయితే గెలుచుకున్నాడు కానీ, రేవంత్‌కి ప్రైజ్ మనీ పరంగా పెద్దగా గిట్టుబాటు కాలేదు. నిజానికి విన్నర్‌కి రావల్సిన ప్రైజ్ మనీ 50 లక్షలు. కానీ, రేవంత్‌కి 10 లక్షలు మాత్రమే వెళ్లింది.
లాస్ట్ మినిట్‌లో బిగ్‌బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చి. ఫైనల్ విన్నర్‌ని సెలెక్ట్ చేసే క్రమంలో 25 లక్షల రూపాయలున్న గోల్డెన్ బ్రీఫ్ కేస్‌తో హౌస్ లోపలికి వెళ్లిన నాగ్.. టెంప్టింగ్ ఆఫర్లిచ్చి ఆ 25 లక్షలు కాస్తా 40 లక్షలకు పెంచేశాడు.
డబ్బు ముఖ్యం కాదు, ట్రోఫీనే ముఖ్యం అని చెప్పిన శ్రీహాన్ తండ్రి, చివరికి ఆ సూట్‌కేసు తీసుకోమని చెప్పగా, తల్లితండ్రుల కోసం శ్రీహాన్ గోల్డెన్ బ్రీఫ్ కేస్ సొంతం చేసుకున్నాడు.
టాప్‌లోకి చేరిన ఆ ఇద్దరూ విన్నర్సే కానీ, ఒక్కటే తేడా ట్రోఫీ.. సమయానుకూలంగా స్పందించి 40 లక్షలతో గోల్డెన్ బ్రీఫ్ కేస్ దక్కించుకున్న శ్రీహానే అసలు సిసలు విన్నర్ అని నాగ్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో శ్రీహాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
ట్రోఫీ గెలిచి, ఈ సీజన్ విన్నర్ అయ్యి, తన పాపకు ఆ ట్రోఫీని అందించాలనుకున్న రేవంత్ కోరిక కూడా నెరవేరడంతో, ఈ సీజన్ విన్నర్స్ ఇద్దరూ హ్యాపీ హ్యాపీ.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







