అన్ని ప్లస్‌లున్నా నిఖిల్ ఎందుకు సైలెంట్‌గా వున్నాడో.!
- December 19, 2022
‘కార్తికేయ 2’తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ దక్కించుకున్న నిఖిల్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ‘18 పేజెస్’ సినిమాతో.
ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం నిఖిల్‌కి నిజంగానే లక్ అనే చెప్పొచ్చు. ‘కార్తికేయ 2’ తో వచ్చిన క్రేజ్‌కి ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, నిఖిల్ అందుకు ఒప్పుకోలేదట.
రొమాంటిక్ దృశ్య కావ్యంలా తోస్తోంది ప్రోమోస్ చూస్తుంటే ‘18 పేజెస్’. అంతేకాదు, ఈ సినిమాకి సుకుమార్ కథ అందించడం మెయిన్ అస్సెట్‌గా చెప్పొచ్చు.
పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాడు. అలాగే, నిర్మాణంలోనూ సుకుమార్ హస్తముంది. అన్నింటికీ మించి ‘కార్తికేయ 2’తో హిట్ పెయిర్‌గా పాపులర్ అయిన అనుపమా, నిఖిల్ పెయిర్ ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్.
ఇన్ని స్పెషల్స్ వున్న సినిమాని, రవితేజ ‘ధమాకా’తో పోటీ పడి రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ వుంటే, పోటీతో సంబంధమే లేదనుకోండి. చూడాలి మరి, ‘కార్తికేయ 2’ సక్సెస్‌ని నిఖిల్ ‘18 పేజెస్’తో కంటిన్యూ చేస్తాడా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







