రాబోయే రోజుల్లో సౌదీలో కుండపోత వర్షాలు!
- December 20, 2022
            సౌదీ: బుధవారం నుండి శుక్రవారం వరకు సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) హెచ్చరిక జారీ చేసింది. ప్రతికూల వాతావరణం ఉంటుందని, అనేక ప్రాంతాలలో ఉరుములు, వడగళ్ళు పడే అవకాశం ఉందని, అలాగే దుమ్ముతో కూడి తక్కువ దృశ్యమానత ఉంటుందని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని NCM సూచించింది.
మక్కా, అల్-బహా, అల్-మదీనా, హైల్, నార్తర్న్ బోర్డర్స్, అల్-ఖాసిమ్, రియాద్, అసిర్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, బుధవారం సాయంత్రం నుండి గురువారం ఉదయం వరకు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రియాద్, మదీనా, నార్తర్న్ బోర్డర్స్, అల్-జౌఫ్, ఈస్టర్న్ రీజియన్లోని కొన్ని ప్రాంతాలలో గురువారం మరియు శుక్రవారం నుండి వర్షాలు మోస్తరుగా కురుస్తాయని సూచించింది. మదీనా, తబుక్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు, అల్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతోపాటు తబుక్ ప్రాంతంలోని పర్వతాలపై గురువారం సాయంత్రం మరియు శుక్రవారం నుంచి మంచు కురిసే అవకాశం ఉందని ఎన్సీఎం పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







