డిసెంబర్ 22న శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ కోటా విడుదల
- December 20, 2022
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి వైకుంఠ ద్వారా దర్శనం కోసం శ్రీవాణి ఆన్ లైన్ కోటా విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటించింది.శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వారా దర్శనం కోసం.. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 22వ తేదీని విడుదల చేనున్నారు. ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి.
ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.
తిరుపతిలోని అలిపిరి జూపార్క్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను టీటీడీ(TTD) జేఈఓ సదా భార్గవి పరిశీలించారు. ఇటీవల వర్షాలు కురవడంతో పనులు ఆలస్యం అయ్యాయని జేఈఓ చెప్పారు. ఇందుకోసం అదనంగా కార్మికులను ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డిసెంబరు లోపు గ్రౌండ్ లెవల్ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు. జెఈఓ వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
అంతకుముందు తిరుపతిలోని పరిపాలన భవనంలోని కార్యాలయంలో జెఈఓ సదా భార్గవి.. పంచగవ్య ఉత్పత్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తుల విశిష్టతను తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఉత్పత్తులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఎస్వీబీసీ(SVBC)లో ప్రోమోలు రూపొందించి ప్రసారం చేయాలని కోరారు. పిల్లలకు, యువతకు, మహిళలకు, వయసు పైబడిన వారికి కేటగిరీల వారీగా ఈ ఉత్పత్తులను విభజించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో టీటీడీ నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనతో పాటు పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తీలను కలిపి ప్రదర్శన, విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న యూపీఐ పేమెంట్లను చక్కగా ఉపయోగించుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







