హీరో హరనాథ్ కూతురు హఠాన్మరణం
- December 20, 2022
హైదరాబాద్: చిత్రసీమలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది దిగ్గజ నటి నటులు మృతి చెందగా..తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు హరనాథ్ కుమార్తె పద్మజ రాజు(54) మంగళవారం గుండెపోటుతో మరణించారు.
ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ జీవితంపై ‘అందాల నటుడు’ అనే పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ఆవిష్కరించారు. పద్మజా రాజు భర్త జీవీజీ రాజు పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత, తొలిప్రేమ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. గోదావరి చిత్రం కూడా జీవీజీ రాజు నిర్మాణంలోనే తెరకెక్కింది. పద్మజా రాజు మాట్లాడుతూ.. త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికల్లా తన ఇంటి నుంచి మరో నిర్మాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని పద్మజా రాజు చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ఆమె కన్నుమూయడం విషాదకరం.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







