ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
- December 20, 2022
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన వారి శాంపిల్స్ సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కేంద్రం ఆదేశించింది. కొంతకాలంగా చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.
చైనాతోపాటు అమెరికా, జపాన్, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ అంశంపై ముందుగానే కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ దీనిపై స్పందించారు. పాజిటివ్ కేసులకు సంబంధించిన శాంపిల్స్ సేకరించి, వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీని ద్వారా కొత్తగా విజృంభిస్తున్న కోవిడ్ రకాలను గుర్తించి, వాటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. వారానికి 35 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కొత్తగా పుట్టుకొస్తున్న కోవిడ్ వైరస్ రకాలను గుర్తించడం ద్వారా వాటిని ఎదుర్కోవడం సులభమవుతుంది. చైనాలో ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉంది. రాబోయే మూడు నెలల్లో చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కనీసం 60 శాతం మందికి కోవిడ్ సోకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కోవిడ్ ద్వారా మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







