అబుధాబిలో 159 మంది యాచకులు అరెస్ట్

- December 21, 2022 , by Maagulf
అబుధాబిలో 159 మంది యాచకులు అరెస్ట్

యూఏఈ: నవంబర్ 6 నుండి డిసెంబర్ 12 వరకు 159 మంది యాచకులను అరెస్టు చేసినట్లు అబుధాబి పోలీసులు వెల్లడించారు. యాచకులు డబ్బు సంపాదనకు తప్పుదోవ పట్టించే కథనాలను వెల్లడించి సంఘ సభ్యుల సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తారని, ఇలాంటి మాయలను నమ్మవద్దని పోలీసులు పిలుపునిచ్చారు. యాచకులను నియంత్రించడానికి నిరంతర ప్రచారాలను నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. 999 ద్వారా భిక్షాటన కేసులను నివేదించడం ద్వారా భిక్షాటనను నిరోధించడానికి పోలీసులకు సహకరించాలని, సానుకూలంగా సహకరించాలని ప్రజలను కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com