రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించండి: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
- December 21, 2022
న్యూఢిల్లీ: చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. మీటింగ్ అనంతరం మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని, అందరూ అలర్ట్గా ఉండాలని, నిఘా పెంచాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది.చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంత్రి మాండవీయ మీటింగ్లో పాల్గొన్న అధికారులు అందరూ మాస్క్లు ధరించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







