ధహిరాలో బయటపడ్డ పురాతన నగరం

- December 21, 2022 , by Maagulf
ధహిరాలో బయటపడ్డ పురాతన నగరం

మస్కట్: వార్సా విశ్వవిద్యాలయం పోలిష్ మిషన్ సహకారంతో ధహిరాలో నిర్వహించిన తవ్వకాల్లో 1వ సహస్రాబ్ది బీసీ(ఇనుప యుగం) నాటి పురాతన నగరాన్ని కొనుగొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. ఆరవ సీజన్‌లో ఐన్ బని సైదా పురావస్తు ప్రదేశంలో జరిపిన త్రవ్వకాల్లో, ఇనుప యుగం నాటి పురాతన నగరం అవశేషాలు గుర్తించినట్లు పేర్కొంది. వార్సా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ పీటర్ బెలిన్స్కీ మాట్లాడుతూ.. తాము ఒక చిన్న పురాతన నగరాన్ని కనుగొన్నామని, అది ఆ సమయంలో ఏర్పడిన సామాజిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్నారు. ఆ స్థలంలో చేతితో తయారు చేయబడిన ఒక అలంకరించబడిన కుండల గిన్నెను కూడా గుర్తించామని తెలిపారు. గిన్నెతో పాటు, ఇతర కుండల పాత్రలు, నిచ్చెనలు, వంట స్టవ్‌లు కూడా కొత్తగా గుర్తించిన సైట్‌లో కనుగొన్నట్లు బెలిన్స్కీ తెలిపారు. కొత్తగా గుర్తించిన ప్రాంతంలో ఒక నాయకుడు లేదా పాలకుడు తన కుటుంబంతో నివసించేవాడన్నారు. ధహిరాలోని హెరిటేజ్ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అలీ బిన్ ఖమీస్ అల్ సుదైరి మాట్లాడుతూ.. ఈ ప్రదేశం సహమ్‌లోని బ్యాట్, సలుట్, దహ్వా వంటి ఇతర పురావస్తు ప్రదేశాలతో చారిత్రక సంబంధం కలిగి ఉందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com