ప్రముఖ ఆర్థోపెడిషియన్ డా.రవి చంద్ర వట్టిపల్లితో ముఖాముఖి...
- December 22, 2022ప్ర): ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఏమిటి. అది ఎప్పుడు అవసరం?
జ): ఎముకలు, కీళ్లను ప్రభావితం చేసే వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స అవసరం. ఇది పగుళ్లు వంటి అత్యవసర పరిస్థితుల నుండి వెన్నునొప్పి, మోకాలి కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థోపెడిక్ సర్జరీ అవసరం అవుతుంది.
ప్ర): ఆర్థోపెడిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జ): నొప్పి ఉపశమనంతో పాటు కదలికకు త్వరగా తిరిగి తీసుకురావడం, కొన్నిసార్లు సాధారణ ఎముకల నిర్మాణాన్ని పునరుద్ధరించేందుకు ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తారు. ఆర్థో పీడియా అంటే స్ట్రెయిట్ చైల్డ్. ఆర్థోపెడిక్స్ మొదట్లో పెరుగుతున్న పిల్లలను ఎలాంటి వైకల్యాలు లేకుండా సంక్రమంగా చేసే శాస్త్రం.
ప్ర): ఆర్థోపెడిక్ సర్జన్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
జ): కీళ్లలో నొప్పి, వెన్నునొప్పి, అవయవాలకు గాయాలు లేదా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితులు తలెత్తిన సమయంలో ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించడం అవసరం.
ప్ర): ఆర్థోపెడిక్, జైంట్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి ముందు పరీక్షలు/పరిశోధనలు అవసరమా?
జ): గ్రేడ్ 3 లేదా 4 ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తికి, తీవ్రమైన కీళ్ల నొప్పులతో, శస్త్రచికిత్స కోసం పేషెంట్ల ఆరోగ్య పరిస్థిని అంచనా వేయడం కీలకం. దీనిపైనే ఆపరేషన్ ఫలితం ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంలో ఇది ఎంతగానో సహయకారిగా నిలుస్తుంది. ముఖ్యంగా పేషెంట్లలో నరాలు లేదా గుండె సంబంధిత వ్యాధుల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
ప్ర): యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
జ): యూరిక్ యాసిడ్ అనేది మూత్రంలో ఒక భాగం. ఇది జీవక్రియ తుది ఉత్పత్తి ప్యూరిన్. ప్యూరిన్లు రసాయన సమ్మేళనాలలో కీలకమైన భాగం. ఇవి మన DNA, RNA బిల్డింగ్ బ్లాక్‌లను కలిగి ఉంటాయి. హైపర్‌యూరికేమియా అనేది రక్తంలో యూరిక్ యాసిడ్ సాధారణ స్థాయిల కంటే శరీరం ఎక్కువగా అనుభవించే పరిస్థితి. ఇది ఉత్పత్తి పెరగడాన్ని సూచిస్తుంది. ఉదా.. ఆల్కహాల్, ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవడం లేదా శరీరంలోని జీవక్రియ సమస్యల కారణంగా మూత్ర విసర్జన తగ్గుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి కీళ్లలో చేరి సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా దీని కారణంగా కాలి బొటనవేలు ప్రాంతంలో నొప్పి, వాపు కన్పిస్తాయి. దీర్ఘకాలంలో ఇది ఎక్కువైతే కీళ్ల తొలగింపునకు దారితీయవచ్చు.
ప్ర): రుమటాయిడ్ అర్థరైటిస్ అంటే ఏంటి? రుమటాయిడ్ అర్థరైటిస్ కీళ్ళను ఎలా దెబ్బతీస్తుంది?
జ): రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొన్ని రసాయనాల సమ్మేళనంగా ఏర్పడేది. ఇది ముఖ్యంగా కీళ్ళు, శరీరంలోని ఇతర జాయింట్లలో దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. మణికట్టు, చేతులు, మోకాళ్లు, కీళ్ళను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో లింగ్ మెట్లు, టెండన్స్ చుట్టు చేరి వాటి నిర్మాణాన్ని నాశనం చేస్తుంది. దీంతో జాయింట్లలో తీవ్రమైన నొప్పికి కారణం అవుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే శారీరకంగా, మానసికంగా వికలాంగులను చేస్తుంది.
ప్ర): మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కోసం సాధారణ పునరుద్ధరణ సమయం ఎంత?
జ): మోకాలి మార్పిడి అనేది ఈ కాలంలో విజయవంతమైన ఆపరేషన్ గా మారింది. యాంటీబయాటిక్ మందులతో పూర్తి భద్రతతో పాటు ఆధునిక ఇంప్లాంట్ డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స చేసిన అదే రోజు రోగులు నడవవచ్చు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నుండి కోలుకోవడం ఎక్కువగా రోగి విల్లింగ్ నెస్, రిహబిలిటేషన్ పార్టిసిపెంట్ పై ఆధారపడి ఉంటుంది.
ప్ర): మోకాలి ఇంప్లాంట్లు ఎన్ని రకాలు?
జ): నేడు అనేక రకాల ఇంప్లాంట్ రకాలు అందుబాటులో ఉన్నాయి.కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలలో ట్రిబాలజీ(జాయింట్ల మధ్య ఫిక్షన్ తగ్గించే శాస్త్రం) పెద్ద మార్పులనే తెచ్చింది.
ఇంప్లాంట్ మనుగడ ఇప్పుడు 15 సంవత్సరాలకు పైగా ఉంది. కొన్ని ఇంప్లాంట్ కంపెనీలు 40 సంవత్సరాల మనుగడ రేటును క్లెయిమ్ చేస్తున్నాయి. అయితే రోగి పరిస్థితిని బట్టి ఇంప్లాంట్ ఎంపికను వైద్యులు చేపడతారు. కొన్ని ఇంప్లాంట్ డిజైన్‌లు గత 20 సంవత్సరాలుగా వాడుకలో ఉండి ప్రాక్టికల్ గా నిరూపితమయ్యాయి. ఎక్కువగా వీటినే వైద్యులు పరిగణనలోకి తీసుకుంటారు.
--డా.రవి చంద్ర వట్టిపల్లి(అపోలో హాస్పిటల్, విశాఖపట్నం)
మొబైల్ నెం:9398600638
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్