‘18 పేజెస్’ మూవీ రివ్యూ
- December 23, 2022‘కార్తికేయ 2’ హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్ద్ నుంచి వచ్చిన సినిమా ‘18 పేజెస్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ కథ అందించిన ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించారు. సుకుమార్ కథ కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయ్. ప్రీ రిలీజ్ బజ్ కూడా బాగా ఏర్పడింది. మరి, సినిమా ఎలా వుందో.! నిఖిల్ కెరీర్‌లో మరో హిట్టు పడిందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
సిద్ధు (నిఖిల్) సాఫ్ట్‌వేర్ వుద్యోగి. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి లవలో మోసపోతాడు. ఆ తర్వాత నిఖిల్‌కి ఓ డైరీ దొరుకుతుంది. నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి రాసిన డైరీ అది. ఆ డైరీని చదువుతూ నందినితో ప్రేమలో పడిపోతాడు సిద్ధు. ఆ డైరీలోని ప్రతీ పేజీతోనూ తన జీవితాన్ని కనెక్ట్ చేసుకుంటూ, ఆ లైఫ్ స్టైల్‌లోకి తన లైఫ్ స్టైల్‌ని మార్చేసుకుంటాడు సిద్ధు. ఇంతలో ఓ ట్రస్ట్ పని మీద రంగనాధ్ అనే వ్యక్తిని కలిసి ఓ కవర్ ఇచ్చేందుకు హైద్రాబాద్ వస్తుంది నందిని. ఈ క్రమంలో ఆమెని ఓ గ్యాంగ్ వెంటాడుతుంటుంది. అక్కడితో అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కవర్‌లో ఏముంది.? నందినిని వెంటాడుతున్న ఆ గ్యాంగ్ ఎవరు.? చివరికి నిందిని, సిద్ధులు కలిశారా.? అనేది తెరపైనే చూడాలి.
నటీనటుల పని తీరు:
ఓ సాప్ట్‌వేర్ కుర్రోడి పాత్రలో నిఖిల్ చక్కగా ఒదిగిపోయాడు. లవ్ ఫెయిల్యూర్‌లోనూ, కొత్త లవ్‌ని ఆస్వాదించడంలోనూ తనదైన శైలి ఎమోషన్ పండించాడు. వేరియేషన్లు బాగా చూపించాడు. అలాగే, ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీన్లలో అద్భుతమైన నటన కనబరిచాడు నిఖిల్. అనుపమ విషయానికి వస్తే, ఆమె మంచి నటి. చెప్పక్కర్లేదు. కానీ, గతంతో పోల్చితే, ఈ సినిమాలో ఇంకా కొత్తగా కనిపించి మెప్పించింది. అమాయకత్వంతో కూడిన ఎక్స్‌ప్రెషన్లు కళ్లతోనే పలికించేసింది. సరయుకి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. మిగిలిన పాత్ర ధారులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
కథ కొత్తగా కనిపించింది. 18 పేజీల కథ. ప్రతీ పేజీని అద్భుతంగా మనసుకు హత్తుకునే విధంగా తెరపై మలిచాడు డైరెక్టర్ సూర్య ప్రతాప్. స్వచ్ఛమైన ప్రేమకు మాటలు అవసరం లేదన్న అనుభూతిని ప్రేక్షకుడికి కొత్తగా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లుగా సాప్ట్‌గా అలరించింది. గోపీ సుందర్ అందించిన సాంగ్స్ విజువల్‌గానే కాదు, వినసొంపుగానూ వున్నాయ్. ఎడిటింగ్‌కీ వంకలు పెట్టడానికి లేదు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్లుగా వున్నాయ్. గురూజీ సుకుమార్ అందించిన కథను ఎక్కడా డ్యామేజ్ చేయకుండా శిష్యుడు సూర్య ప్రతాప్, ప్రేక్షకుడి మనసును హత్తుకునేలా తెరకెక్కించడంలో హండెండ్‌కి హండ్రెడ్ పర్సంట్ మార్కులేయించుకున్నాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ సినిమాకి ప్రాణం. ‘ప్రేమించడానికి కారణాలు అవసరం లేదు. కానీ, ఓ మంచి కారణం వల్ల పుట్టిన ప్రేమను ఎలా కాదనగలం.?’ అనే డైలాగ్‌తో సాప్ట్‌గా సినిమాని ముగించేసిన తీరు బావుంది.
ప్లస్ పాయింట్స్:
కొత్త కథ,
కథనం నడిపించిన తీరు,
నిఖిల్, అనుపమ పర్‌ఫామెన్స్,
మైనస్ పాయింట్స్:
లాజిక్స్ అడక్కూడదు. మ్యాజిక్ మిస్ అవుతారంతే.!
చివరిగా: ‘18 పేజెస్’.. ప్రతీ పేజీలోనూ ప్రేమ నిండిపోయింది. నిఖిల్ కెరీర్‌లో మరో హిట్ జమ అయిపోయినట్లే.!
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్