హీరోగా అడుగు పెట్టి..విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన కైకాల
- December 23, 2022
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఇక లేరు.ఈ రోజు అనగా డిశంబర్ 23 శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.గత కొన్ని నెలలుగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం ఏమంత బాగా లేదు.
నవంబర్‌లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణ వెంటిటేటర్ చికత్స వరకూ వెళ్లారు. ఆ తర్వాత కాస్త ఆరోగ్యం కుదుట పడడంతో వైద్యలు పరిరక్షణలో వున్నారు.
కానీ, అంతంత మాత్రం ఆరోగ్యంతోనే ఆయన నెట్టుకొస్తున్నారు.చివరికి మృత్యువుతో పోరాడి ఈ తెల్లవారు జామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆయన మరణం టాలీవుడ్‌ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
రేపు అనగా 24 వ తేదీన జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్య క్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
యమధర్మరాజు, ఘటోత్కచుడు, ధుర్యోధనుడు.. ఇలాంటి పలు పాత్రలకు కైకాల పెట్టింది పేరు. ఆయా పాత్రల్లో కైకాల కనిపించేవారు కాదు. కేవలం ఆయా పాత్రలు మాత్రమే కనిపించేవి. యమధర్మరాజు పాత్ర అంటే వన్ అండ్ ఓన్లీ కైకాల సత్యనారాయణే. ‘యముండ..’ అనే సౌండింగ్‌లోని గాంభీరం అతని సొత్తు. ‘మహర్షి’ సినిమా తర్వాత కైకాల మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.నటనతో పాటూ, లోక్‌సభ ఎంపీగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు కైకాల సత్యనారాయణ.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







