పవన్ కొత్తసినిమా ప్రారంభం
- April 27, 2016
'సర్దార్ గబ్బర్‌సింగ్' డిజాస్టర్ నుంచి కోలుకున్న పవన్‌కల్యాణ్ కొత్తసినిమాతో సెట్స్‌పైకి వెళ్తున్నాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా హైదరాబాద్‌లో ఓ టెంపుల్ లో ఈ ఉదయం పదిన్నరకు కొత్త చిత్రం సైలెంట్‌గా ముహూర్తం జరిగిపోయింది.ఈ కార్యక్రమానికి పవన్, డైరెక్టర్ సూర్య, ప్రొడ్యూసర్ శరత్ మరార్ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కావాల్సివుంది.రామజోగయ్యశాస్ర్తి రాసిన రెండుసాంగ్స్ను ఇటీవల ముంబైలోని ఓ స్టూడియోలో రికార్డింగ్ చేశారు. 'ఖుషీ సీక్వెల్'గా ప్రచారం సాగుతున్నప్పటికీ, అదేంకాదని అంటున్నారు పవన్ క్లోజ్‌ఫ్రెండ్స్. ఈ చిత్రానికి రూబెల్స్ మ్యూజిక్ డైరెక్టర్.శరత్ మరార్ నిర్మాతగా రానున్న ఈ సినిమాని, నార్త్ స్టార్ బ్యానర్ - పవన్ కల్యాణ్ క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 'ఖుషి' వచ్చిన 15 ఏళ్ల తర్వాత ఎస్‌జె సూర్య - పవన్ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్తోంది. వచ్చేఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. దీనికి సంబందించి డీటేల్స్ త్వరలో వెల్లడికానున్నాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









