బీచ్‌లో తలకిందులుగా కూలిపోయిన విమానం..
- December 23, 2022
అమెరికా: అమెరికాలోని బీచ్‌లో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ ఘటన లాస్ ఏంజెల్స్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను అక్కడివాళ్లు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అక్కడ వైరల్ అవుతోంది.
ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే, సింగిల్ ఇంజిన్ కలిగిన చిన్న విమానం ఒకటి లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఈ విమానం మాలిబు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కు తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలియజేశారు. అయితే, విమానాన్ని ఎయిర్‌పోర్టు తేవడం సాధ్యపడలేదు. దీంతో విమానాన్ని బీచ్‌లో ల్యాండ్ చేస్తామని పైలట్లు అధికారులకు తెలిపారు. అది చాలా రిస్క్ అని వాళ్లు హెచ్చరించారు. అయితే, తమకు మరో మార్గం లేకపోవడంతో విమానాన్ని బీచ్‌లో దించేందుకు ప్రయత్నించారు. ఈలోగానే విమానం పసిఫిక్ సముద్రం ఒడ్డున కూలిపోయింది.
బీచ్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగానే నీళ్లలో పడిపోయింది. అనంతరం కొద్ది దూరం దూసుకెళ్లి తలకిందులుగా పడిపోయింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది, విమానంలోని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనను అక్కడి వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







