భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్..
- December 24, 2022
న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రముఖ సినీ నటుడు, మక్క్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ శనివారం పాల్గొన్నారు. ఢిల్లీలో కొనసాగుతున్న ఈ యాత్రలో ఆయన చేరారు. రాహుల్ గాంధీతో కలిసి ఎర్రకోటకు పయనిస్తున్న యాత్రలో కలిసి నడిచారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెసేతర పార్టీలు సైతం పాలు పంచుకుంటున్నాయి. యాత్ర ప్రారంభం రోజే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలు ఈ యాత్రకు మద్దతుగా రాహుల్‌తో కలిసి నడిచారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ సైతం ఈ యాత్రలో పాదం పంచుకోవడం గమనార్హం.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత ఎక్కువైంది. రాహుల్ యాత్ర ప్రారంభించనప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆదరణ పెరిగింది. ప్రచారం కూడా పెరిగింది. దీంతో రాహుల్ షేర్ చేసిన ఈ ఫొటోపై కాంగ్రెస్ కార్యకర్తలు ఉబ్బితబ్బివుతున్నారు. తమ ఆనందాన్ని, గౌరవాన్ని ట్వీట్లు, కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులు ముగించుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరనుంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పాదయాత్ర అని, రెండవ దశ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







