ఖతార్ ఎయిర్ వేస్ విమానం వాష్ రూమ్ లో లభించిన బంగారం ...
- April 27, 2016
ఒక వేళ మీరుగానీ ఆ విమానంలో ప్రయాణించి ఉంటే.. అందులోని వాష్ రూమ్ లోకి వెళ్లుంటే.. ఆ మూలన ఉన్న చిన్నపాటి బంగారుకొండను చూసి అదిరిపోయేవారు. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా ఏడు కేజీల బంగారమది. ఓనరంటూ ఎవ్వరూలేని, ఓ నలుపు రంగు బ్యాగ్ లో దాగున్న ఆ బంగారాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం వాష్ రూమ్ లో లభించిన బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. విమానం సిబ్బందేమో 'మాకు తెలియదంటే మాకు తెలియదు' అని తడుముకోకుండా చెబుతున్నారు.ఏదైనా విమానం ల్యాండ్ అయ్యాక, మళ్లీ టేకాఫ్ అయ్యే ముందు దానిని క్షుణ్నంగా తనిఖీ చేయడం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ రోజూ జరిగేదే. అలా బుధవారం ఖతార్ నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా టాయిలెట్ లో ఒక మూలన బంగారు ఆభరణాలతో నిండిన బ్యాగ్ దొరికింది అధికారులకు. బయటికి తీసుకొచ్చి తూస్తే వాటి బరువు 7.12 కిలోలుఉంది. విలువ ఎంతుందనేది లెక్కలుకట్టాక చెబుతామని, ఆలోపు ఈ బ్యాగ్ ఎవరిదో కనిపెడతామని చెప్పారు గోవా డివిజన్ కస్టమ్స్ కమిషనర్ అన్పజఖన్.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









