శాంటా క్లాజ్ గా మారిన ఎమిరేట్స్ A380 విమానం..
- December 25, 2022
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో యూఏఈ జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కూడా క్రిస్మస్ హాలిడే మూడ్ లోకి వచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానాన్ని శాంటా క్లాజ్ గా తీర్చిదిద్దింది.ఆ విమానాన్ని రెయిన్ డీర్లు లాగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్ ను విడుదల చేసింది. క్రిస్మస్ సెలవుల్లో సురక్షితమైన ప్రయాణం, సహనం వంటి సానుకూల అంశాలకు సంకేతమైన శాంటి క్లాజ్ ను గుర్తు చేసింది.
విమానం ముందు భాగంపైన శాంటా క్లాజ్ టోపీ మాదిరిగా ఎమిరేట్స్ సంస్థ ఏర్పాటు చేసింది. విమానాన్ని రెయిన డీర్లు ఆకాశంలోకి లాగుతున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ ఎంతో ఆకట్టుకుంది. కెప్టెన్ క్లాజ్, టేకాఫ్ కోసం అనుమతి కోరుతున్నారు అనే క్యాప్షన్ తో ఉన్న ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.మెర్రీ క్రిస్మస్ ఫ్రమ్ ది ఎమిరేట్స్ అని విష్ చేసింది.ఈ విడీయో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలో వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి.రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుతో వీధులన్నీ వెలిగిపోతున్నాయి.క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రపంచంలో క్రైస్తవులంతా పండగ మూడ్ లోకి వెళ్లారు. అనేక చోట్ల భారీ క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు.అవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.షాపుల్లో క్రిస్మస్ స్పెషల్ కేకులు నోరూరిస్తున్నాయి. క్రిస్మస్ ట్రీస్, స్పెషల్ ఆర్టికల్స్ తో షాపులన్నీ నిండిపోయాయి.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







