విదేశీ ప్రయాణికులకు అమెరికా శుభవార్త...
- December 25, 2022
అమెరికా: విదేశీ ప్రయాణికులకు అమెరికా శుభవార్త తెలిపింది.వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది పాటు ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చింది. భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వివిధ వృత్తి నిపుణులకు ఈ అవకాశం కల్పించింది. అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు సహా వలసేతర వీసా దరఖాస్తుదారులకు కల్పించిన ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయాన్ని వచ్చే ఏదాడి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులు (హెచ్-2 వీసాలు), విద్యార్థులు (ఎఫ్,ఎం వీసాలు), అకడమిక్ ఎక్సేంజ్ విజిటర్ల (అకడమిక్ జే వీసాలు) కేటగిరీల వారు వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయం పొందేందుకు అర్హులని వెల్లడించింది.
స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ (హెచ్-1బీ), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్ (హెచ్-3 వీసాలు), ఇంట్రాకంపెనీ ట్రాన్స్ ఫరీలు (ఎల్ వీసాలు), అసాధారణ ప్రతిభావంతులు (ఓ వీసాలు), క్రీడాకారులు, ఎంటర్ టైనర్లు (పీ వీసాలు), అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనే వారు (క్యూ వీసాలు), క్వాలిఫయింగ్ డెరివేటివ్ కేటగిరీల్లో నాన్-ఇమ్మిగ్రెంట్ తాత్కాలిక వర్క్ వీసాలకు ఆమోదించిన కొన్ని రకాల వ్యక్తిగత పిటిషన్ల లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు







