ఇమేజిన్ కప్ విక్టర్స్ని ప్రకటించిన మైక్రోసాఫ్ట్
- April 27, 2016
ఖతార్ యూనివర్సిటీ నుంచి రెండు టీమ్‌లు, కార్నిగీ మెలన్ యూనివర్సిటీ నుంచి ఒక టీమ్ ఇమేజిన్ కప్ 2016 విన్నర్స్‌గా ప్రకటింపబడ్డాయి. మైక్రోసాఫ్ట్ ఖతార్ ఈ వివరాల్ని ప్రకటించింది. మూడు కేటగిరీల్లో విజేతల్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ఖతార్ జనరల్ మేనేజర్ నయీమ్ యాజ్బెక్ విజేతల వివరాల్ని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. కెంపిన్సికి మర్సా మలాజ్లో జరిగిన స్టూడెంట్ టెక్నాలజీ కాంపిటీషన్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ జస్సిమ్ సైఫ్ అహ్మద్ అల్ సులైతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖతార్ యూనివర్సిటీకి చెందిన టీమ్ ఎక్స్బ్లింక్ - ఇన్నోవేషన్ కేటగిరీ, కార్నిగీ మెలన్ యూనివర్సిటీ ఖతార్‌కి చెందిన టీమ్ బజ్కాస్ట్ - సిటిజన్‌షిప్ కేటగిరీ, ఖతార్ యూనివర్సిటీకి చెందిన టీమ్ ఫోకస్ - గేమింగ్ కేటగిరీలో విజేతలుగా నిలిచాయి. ఈ మూడు టీమ్‌లు కైరోలో మూడవ పాన్ అరబ్ సెమీ ఫైనల్స్‌లో పాల్గొననున్నారు. యువతలో నైపుణ్యాల్ని వెలికి తీసుకురావడం ద్వారా ఖతార్ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నామని ఈ సందర్భంగా మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







