నూతన సంవత్సర వేడుకల భద్రతకు 900 పెట్రోలింగ్ వాహనాలు

- December 25, 2022 , by Maagulf
నూతన సంవత్సర వేడుకల భద్రతకు 900 పెట్రోలింగ్ వాహనాలు

కువైట్: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేసింది. సమావేశాలు జరిగే ప్రదేశాలను పర్యవేక్షించడానికి యూనిఫాం, సివిల్ డ్రెస్‌లలో 8,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా సుమారు 900 పెట్రోలింగ్ వాహనాలను సిద్ధం చేసిందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చాలెట్‌లు, పొలాలు, ఎడారి శిబిరాలు, జాబర్ బ్రిడ్జ్‌తో సహా ప్రముఖ సైట్‌లు, వాణిజ్య మాల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతతో పాటు, చట్టానికి వ్యతిరేకంగా, ప్రజా నైతికతలకు విరుద్ధమైన ప్రవర్తనను నిరోధించడానికి భద్రతా దళాలు పర్యవేక్షిస్తాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com