మూడేళ్లలో 77 మంది పిల్లలు చనిపోయారు: OHRC
- December 26, 2022
మస్కట్: గత మూడేళ్లలో మానసిక వేధింపులు, పిల్లల పట్ల పేరెంట్స్ నిర్లక్ష్యం కారణంగా 77 మందికి పైగా పిల్లలు మరణించారని ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) వెల్లడించింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలో మహిళా వ్యవహారాలపై నిపుణురాలు, OHRCలో సమాచార కమిటీ అధిపతి లబీబా బింట్ మొహమ్మద్ అల్ మావ్లియా ఈ దురదృష్టకర సంఘటనలను ధృవీకరించారు. గత మూడు సంవత్సరాలలో ఎక్కువ మంది పిల్లలు, బస్సులు లేదా ప్రైవేట్ కార్లలో మరచిపోయి, లోయలు, ఈత కొలనులలో మునిగిపోవడం వల్ల మరణించారని పేర్కొన్నారు. పిల్లల మరణానికి కారణమైన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఒమానీ మహిళా సంఘం సహకారంతో కమిషన్ ఒమన్ అంతటా పిల్లల పట్ల నిర్లక్ష్యం, వేధింపులను తగ్గించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వారం ముసందం గవర్నరేట్‌లోని ఖాసబ్, బుఖా, దిబ్బ విలాయత్‌లలో కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







