కొత్త స్కెచ్ వేసిన రౌడీ.! ఫలిస్తుందా.?
- December 26, 2022
ఒక్క సినిమాతో తలరాతను మార్చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. యూత్‌లో బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్నాడు.
ఎంత ఫాస్ట్‌గా ఎదిగాడో.. అంతే స్పీడుగా కింద పడిపోయాడు. ‘లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండను నిలువునా ముంచేసింది. పాతాళానికి నెట్టేసింది. రౌడీ తేరుకోవాలంటే, అర్జెంటుగా ఓ హిట్ పడాలి. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడుందా.? అంటే అనుమానమే.
విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం ‘ఖుషీ’ సినిమా వుంది. కానీ, ఈ సినిమా సగం షూటింగ్‌లోనే ఆగిపోయింది. సమంత అనారోగ్యం కారణంగా ‘ఖుషీ’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి.
అందుకే, ఆ ఒక్క సినిమా పైనే ఆశలు పెట్టుకోకుండా విజయ్ దేవరకొండ రూటు మార్చాడట. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అప్పుడెప్పుడో ఓ కథ ఓకే చేసి పెట్టాడు. ఆ కథని అర్జెంటుగా పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందబోయే ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. చూడాలి మరి, రౌడీ స్కెచ్ ఫలిస్తుందో లేదో.!
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







