వలసదారులకు ఐదేళ్ళలో సైదీ అరేబియా గ్రీన్ కార్డ్
- April 27, 2016
సౌదీ అరేబియా, ఐదేళ్ళలో గ్రీన్ కార్డ్ సిస్టమ్‌ని వలసదారుల కోసం అమల్లోకి తీసుకురానుంది. దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు వలసదారులు ముందుకొచ్చేలా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వలసదారులకు మరిన్ని హక్కులు కల్పించడం ఈ గ్రీన్ కార్డ్ సిస్టమ్ ఉద్దేశ్యమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు. చమురు ధరలు పెరిగి బ్యారెల్ 70 డాలర్లు దాటినా, గ్రీన్‌కార్డ్ విషయంలో వెనక్కి తగ్గబోమని ఆయన చెప్పారు. కేవలం చమురు ధరలపై ఆధారపడకుండా ఎకానమీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామనీ, 2020 నాటికి తమ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయని ఆయన అన్నారు. సౌదీ విజన్ 2030లో భాగంగా పలు కీలకమైన నిర్ణయాలకు సౌదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రైవేటైజేషన్, సబ్సిడీల కోత, స్టేట్ ఆయిల్ జెయింట్ అరామ్‌కో వాటాల అమ్మకం వంటివి ఈ విజన్‌లో భాగం. సౌదీల నిరుద్యోగాన్ని 11.6 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం ఈ విజన్‌లో మరో ముఖ్యమైన అంశం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







