రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
- December 26, 2022
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు.ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై రాష్ట్రపతితో కలిసి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం చేరుకున్న ద్రౌపదీ ముర్ముకు ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామివారి ఆలయంలో రాష్ట్రపతి పూజల్లో పాల్గొంటారు. అనంతరం శ్రీశైలంలో ‘ప్రసాద్’ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
శ్రీశైలం నుంచి సైనిక హెలికాప్టర్లో నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి, త్రివిధ దళాల అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సైనిక వందనం స్వీకరించిన ద్రౌపది ముర్ము అక్కడి నుంచి బోల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







