పాకిస్తాన్ బోటు నుంచి రూ.300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం..

- December 26, 2022 , by Maagulf
పాకిస్తాన్ బోటు నుంచి రూ.300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం..

గుజరాత్: పాకిస్తాన్ నుంచి బోటు ద్వారా అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్, ఆయుధాల్ని భారత తీర రక్షణ దళం పట్టుకుంది.గుజరాత్ తీరంలో ఈ బోటును ఆదివారం అర్ధరాత్రి తర్వాత స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పడవ గురించిన సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా ఐసీజీ అధికారులకు అందింది.

దీంతో మరింత భద్రతతో, తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్‌కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది. ఈ సమయంలో రూ.300 కోట్ల విలువైన 40 కేజీల డ్రగ్స్, భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకున్న ఐసీజీ సిబ్బంది బోటును తదుపరి విచారణ కోసం భారత్‌లోని ఓఖా తీరానికి తీసుకొచ్చింది. బోటులోని పది మంది సిబ్బందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కూడా ఇందులో పాల్గొంది.

గతంలో కూడా ఇలాంటి బోట్లను ఐసీజీ సిబ్బంది ఈ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం 50 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.350 కోట్లు ఉంటుంది. గత సెప్టెంబర్‌లో 40 కేజీల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఏసీజీ, ఏటీఎస్ సిబ్బంది ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com