షార్జాలో పార్కులు తాత్కాలికంగా మూసివేత
- December 27, 2022
షార్జా: ప్రస్తుత అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా షార్జాలోని అధికారులు ఈ రోజు డిసెంబర్ 26 నుండి నగరంలోని అన్ని పార్కులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు కుదుటపడిన తర్వాత పార్కులు తిరిగి తెరవబడతాయని షార్జా సిటీ మునిసిపాలిటీ తెలిపింది. షార్జాలో భారీ వర్షాల కారణంగా ప్రధాన, చిన్న రహదారులకు సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో, అలాగే ఇతర ప్రదేశాలలో చేరే నీటిని తొలగించేందుకు 110కి పైగా ట్యాంకులు, 80 పంపులను సిద్ధంగా ఉంచామని, వాతావరణాన్ని బట్టి ఈ సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచుతామన్నారు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్‌లను అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులు సురక్షితంగా ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







