నాసల్ టీకా బూస్టర్ డోస్ ధర రూ.800..భారత్ బయోటెక్ వెల్లడి

- December 27, 2022 , by Maagulf
నాసల్ టీకా బూస్టర్ డోస్ ధర రూ.800..భారత్ బయోటెక్ వెల్లడి

న్యూఢిల్లీ: నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్‌ ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గా నిర్ణయించింది. నాసల్ వ్యాక్సిన్ ఇన్ కోవాక్ CoWinలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ నాసల్ టీకాను కేంద్ర సర్కారు బూస్టర్ డోస్ గా ఆమోదించడం తెలిసిందే. దీన్ని కోవిన్ యాప్ లో చేర్చారు. దీంతో కోవిన్ యాప్ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

రెండు డోస్‌ల ప్రాథమిక షెడ్యూల్‌, హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఆమోదం పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాజిల్ కోవిడ్ వ్యాక్సిన్‌ ఇన్ కోవాక్ అని భారత్ బయోటెక్ ప్రకటించింది. 14 ఏళ్లు పైబడినవారికి మూడో దశ క్లినికల్, హెటెరోలాగస్ ట్రయల్స్‌ను దేశంలోని 9 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇక iNCOVACC వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను జనవరి నెలాఖరులో విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com