నాసల్ టీకా బూస్టర్ డోస్ ధర రూ.800..భారత్ బయోటెక్ వెల్లడి
- December 27, 2022
న్యూఢిల్లీ: నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గా నిర్ణయించింది. నాసల్ వ్యాక్సిన్ ఇన్ కోవాక్ CoWinలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ నాసల్ టీకాను కేంద్ర సర్కారు బూస్టర్ డోస్ గా ఆమోదించడం తెలిసిందే. దీన్ని కోవిన్ యాప్ లో చేర్చారు. దీంతో కోవిన్ యాప్ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
రెండు డోస్‌ల ప్రాథమిక షెడ్యూల్, హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఆమోదం పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాజిల్ కోవిడ్ వ్యాక్సిన్ ఇన్ కోవాక్ అని భారత్ బయోటెక్ ప్రకటించింది. 14 ఏళ్లు పైబడినవారికి మూడో దశ క్లినికల్, హెటెరోలాగస్ ట్రయల్స్‌ను దేశంలోని 9 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇక iNCOVACC వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను జనవరి నెలాఖరులో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







