కువైట్‌లో 12.5-63 మిల్లీమీటర్ల వర్షపాతం!

- December 28, 2022 , by Maagulf
కువైట్‌లో 12.5-63 మిల్లీమీటర్ల వర్షపాతం!

కువైట్: అల్పపీడనం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు గరిష్ఠంగా 63 మిల్లీమీటర్లు, కనిష్ఠంగా 12.5 మిమీకి చేరుకుంటాయని కువైట్ వాతావరణ విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మంగళవారం అల్-అహ్మదీ పోర్ట్‌లో 63 మిమీ, కువైట్ సిటీలో 17.7 మిమీ, అల్-జహ్రా గవర్నరేట్‌లో 17.5 మిమీ, కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. బుధవారం కూడా అనేక ప్రాంతాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని డిపార్ట్‌మెంట్‌లోని వాతావరణ నిపుణుడు అబ్దుల్ అజీజ్ అల్-ఖరాకీ వెల్లడించారు. దేశంలో పొడి, చల్లటి గాలులు వీస్తాయని, వాయువ్య గాలులు గంటకు 15 -45 కిలోమీటర్ల మధ్య చురుకుగా ఉంటాయన్నారు. ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com